బావమరిదిని కత్తితో పొడిచిన బావ | - | Sakshi
Sakshi News home page

బావమరిదిని కత్తితో పొడిచిన బావ

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

రఘునాథపల్లి: బావమరిదిని కత్తితో పొడిచి బావ హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రఘునాథపల్లి గ్రామానికి చెందిన పర్వతం ప్రసాద్‌, రజిత దంపతులు తమ కూతురు చందనను ఏడేళ్ల క్రితం వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ బాలాజీ నగర్‌కు చెందిన సిరిగిరి రాజ్‌కుమార్‌ (30)కు ఇచ్చి వివాహం చేశారు. కొన్నాళ్ల తర్వాత దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా తన అక్కను ఎందుకు వేధిస్తున్నావంటూ చందన తమ్ముడు అర్జున్‌ (22) బావ రాజ్‌కుమార్‌ను మందలించాడు. అప్పటి నుంచి అర్జున్‌పై రాజ్‌కుమార్‌ కక్ష పెంచుకున్నాడు. బావమరిదితో స్నేహంగా ఉంటున్నట్లు నటించాడు. సోమవారం రాజ్‌కుమార్‌ అత్తగారింటికి వచ్చి బావ మరిదితో గడిపా డు. మంగళవారం సరదాగా గడుపుదామని బావమరిదితో కలిసి గోవర్ధనగిరి శివారులోకి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం అర్జున్‌ను రాజ్‌కుమార్‌ గోవర్ధనగిరి దర్గా సమీంలోని ఓ వెంచర్‌ వద్దకు తీసుకెళ్లి కత్తితో కడుపులో పొడిచాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు. కత్తి పోటుతో తీవ్రంగా గాయపడిన అర్జు న్‌ను 108లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

బోరు వేసే పని ఉందని తీసుకెళ్లి..

కుటుంబ గొడవలను దృష్టిలో పెట్టుకుని అర్జున్‌ను హత్య చేయాలనే పథకంలో భాగంగా రాజ్‌కుమార్‌ ముందుగానే కత్తి కొనుగోలు చేసి తన ఉంచుకున్నాడు. బోరు వేసే పని ఉందని అర్జున్‌ను దర్గా సమీపంలోని వెంచర్‌ వద్దకు తీసుకెళ్లాడు. చెట్టు కింద కూర్చుంటున్న సమయంలో రాజ్‌కుమార్‌ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై అర్జున్‌ తండ్రి పర్వతం ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఘటన

వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స

పొందుతున్న బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement