హన్మకొండ చౌరస్తా : కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి వెయ్యి రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతికి కొత్త బాటలు వేసిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెయ్యి రోజుల పాలనలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యానికి బోనస్, ఉచిత విద్యుత్, తదితర పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ పదేళ్లపాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ విధ్వంసకర పాలన కొనసాగిందన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ఇలా అనేక అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుంటే ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పింగిళి వెంకటరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, మార్క విజయ్‌గౌడ్, సీనియర్ నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, తిరుపతి, హసన్‌పర్తి మండల మహిళ ఉపాధ్యక్షురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధితో ప్రజల గుండెల్లో కాంగ్రెస్
వరంగల్ ఎంపీ కడియం కావ్య


