నీటి సమస్య కొంత వరకు తగ్గింది | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్య కొంత వరకు తగ్గింది

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

నేను పత్తితోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్నా. గతంలో నీటికొరత కారణంగా పంటలు కాపాడుకోవడం కష్టంగా ఉండేది. ‘మారి’ సంస్థ ద్వారా ‘బెటర్‌ కాటన్‌ ప్రాజెక్టు’లో భాగంగా రూ. 20 వేల సాయం అందడంతో ఫాంపాండ్‌ నిర్మించుకున్న. ఇప్పడు వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో పంటలకు అందిస్తున్న. దీంతో నీటి సమస్య కొంత వరకు తగ్గింది. పంటల పెరుగుదల కూడా మెరుగుపడింది. రైతులకు ‘మారి’ సంస్థ సాయం ఉపయోగకరంగా ఉంది.

దండిగ భాగ్యమ్మ, మహిళా రైతు,

కొండాపురం, పాలకుర్తి మండలం

రైతులకు

స్ఫూర్తిగా నిలుస్తోంది

రైతులు వర్షపు నీటిని సంరక్షించుకుని సాగుకు వినియోగించుకునేలా ‘బెటర్‌ కాటన్‌ ప్రాజెక్టు’ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు నీటి సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. భాగమ్మ నిర్మించుకున్న ఫాంపాండ్‌ నిర్మాణం ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా పంటలకు నీటి భద్రత కల్పించడంతోపాటు భూగర్భ జలాల పెంపునకు కూడా ఫాంపాండ్‌లు దోహదపడుతాయి. భాగ్యమ్మ చిన్న అడుగు.. భవిష్యత్‌లో ఇతర రైతులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు పెద్ద మార్పునకు నాంది కావాలి.

–వెంకటేశ్వర్లు, మేనేజర్‌,

మారి సంస్థ, జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement