న్యూస్‌రీల్
అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖపరకాల కేంద్రంగానే ‘కొండా’ రెండు నిర్ణయాలు
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
● బోధనలో ఒక్కొక్కరిది ఒక్కోశైలి
● ఉమ్మడి జిల్లాలో పలువురు
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక,
ఉపాధ్యాయుల ఎంపిక
● రేపు కొడంగల్‌లో
అవార్డుల ప్రదానం
వాహనాల వేలంతో రూ.6.3 లక్షల ఆదాయం
తొర్రూరు: గుడుంబా సంబంధిత కేసుల్లో ఎకై ్సజ్ శాఖ సీజ్ చేసిన వాహనాలకు వేలం నిర్వహించగా ప్రభుత్వానికి రూ.6.3 లక్షల ఆదాయం సమకూరింది. ఎకై ్సజ్ అధికారులు గురువారం డివిజన్ కేంద్రంలోని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వేలం నిర్వహించారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.కరమ్‌చంద్ పర్యవేక్షణలో సీఐ బూస అశోక్ ఆధ్వర్యంలో 30 వాహనాలకు వేలం నిర్వహించారు. 50మంది వేలం పాటలో పాల్గొనగా 27 వాహనాలను పలువురు దక్కించుకున్నారు. రూ.6.3 లక్షలు ప్రభుత్వానికి సమకూరింది. కార్యక్రమంలో ఎస్సైలు శంకర్, గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు.
పత్తికి రికార్డు ధర రూ.9,015
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి రికార్డుస్థాయి ధర రూ.9,015 పలికింది. గురువారం మార్కెట్‌కు 79 బస్తాల పత్తి రాగా, క్వింటాకు గరిష్ట ధర రూ.9,015, కనిష్ట ధర రూ.2,122 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా, పత్తికి మద్దతు ధర రూ.8,667ఉండగా.. అంతకు మించి ధర పలకడం విశేషం.
మార్కెట్‌కు సెలవులు
మహబూబాబాద్ రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో శుక్రవారం క్రయవిక్రయాలు జరగవని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ గురువారం తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవుల అనంతరం మళ్లీ సోమవారం నుంచి మార్కెట్ పరిధిలో యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయన్నారు.
బాల్యవివాహాలను ప్రోత్సహించొద్దు
బయ్యారం: బాల్యవివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సీనియర్ న్యాయవాది చెన్నమల్లారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తగూడెంలో గురువారం జిల్లా మహిళా సాధికారిత కేంద్రం, చైల్డ్ హెల్ప్‌లైన్ సమన్వయంతో నిర్వహించిన అవగాహన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువతులకు 18, యువకులకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరిపించాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే 1098నంబర్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. అనంతరం బాల్యవివాహా లపై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
జీఓ 97ను రద్దు చేయాలి
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలను శక్తిలో విలీనం చేస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలంటూ బుధవారం మున్సిపాలిటీ కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ముందుగా పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ర్యాలీగా వచ్చి పొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద విద్యార్థులు బైఠాయించారు. అదే విధంగా పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు నిరసన తెలిపారు.
ఎకై ్సజ్ అధికారుల బదిలీలు
మహబూబాబాద్ రూరల్: జిల్లా ఎకై ్సజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ అధికారులు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ సీఐ జి.చిరంజీవి ఖమ్మం వన్ టౌన్‌కు, ఎస్సై ఐ.అశోక్ కుమార్ పదోన్నతిపై పాల్వంచ, ఎస్సై జి.మౌనిక సిద్దిపేట, డీటీఎఫ్ సీఐ సీహెచ్.నీరజ హుస్నాబాద్, డీటీఎఫ్ ఎస్సై ఆర్.కిరీటి ఖమ్మం టు టౌన్, గూడూరు సీఐ ఎన్.భిక్షపతి నిర్మల్, ఎస్సై ఎస్.రాజేశ్వరి పదోన్నతిపై కరీంనగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్, తొర్రూరు ఎస్సై ఎం.రవళి ఖమ్మం జిల్లా వైరాకు బదిలీ అయ్యారు.
విధుల్లో చేరిన నూతన అధికారులు..
జిల్లాలో ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు బదిలీకాగా.. వారి స్థానంలో మానుకోట సీఐగా ఇల్లెందు నుంచి బి.రాంప్రసాద్, రామగుండం నుంచి ఎస్సై ఎం.శ్రీనివాస్, సింగరేణి నుంచి ఎస్సై డి.వసంతలక్ష్మి, తొర్రూరు ఎస్సైగా కొత్తగూడెం డీటీఎఫ్ నుంచి కె.గౌతమ్, గూడూరు ఎస్సైగా బెల్లంపల్లి నుంచి ఎం.వెంకటేష్, మహబూబాబాద్ డీటీఎఫ్ సీఐగా గురునాథ్ సుల్తానాబాద్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్:
మంత్రి పదవినుంచి బర్తరఫ్‌తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్‌కు గురువారం ఎండ్ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం.. హైకమాండ్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కూతురు మాటలనుంచి కేబినెట్ వేటు దాకా..
ఆగస్టు 16న సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరి కొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ
మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటికీ సోనియా, రాహు ల్, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్‌లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.
హనుమకొండ రాంనగర్‌లో నిర్మానుష్యంగా ఉన్న
తాజా మాజీ మంత్రి కొండా సురేఖ నివాసం
‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి..
ఎమ్మెల్యేల నివేదికలతో
ముదిరిన పంచాయితీ
క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు
ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు..
చివరకు కేబినెట్‌నుంచి వేటు
18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు


