ముగిసిన దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన దరఖాస్తుల స్వీకరణ

Sep 4 2026 1:06 AM | Updated on Sep 4 2026 1:06 AM

మహబూబాబాద్‌: జిల్లాలో అంగన్‌వాడీ వ్యవస్థలో 231 పోస్టుల భర్తీకి ఆగస్టు 24న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అదే నెల 25నుంచి ఈనెల 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. కాగా 101 టీచర్‌ పోస్టులకు 2,172 దరఖాస్తులు, 130 ఆయా పోస్టులకు 891 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, ఫైనల్‌గా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

1,437 కేంద్రాలు..

జిల్లాలో 1,437అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాగా 1,309 మంది టీచర్లు, 957 మంది ఆయాలు, 49 మంది సూపర్‌వైజర్లు మాత్రమే పని చేస్తున్నారు. టీచర్లు లేని సెంటర్లను ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఎట్టకేలకు 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

3,063 దరఖాస్తులు..

జిల్లా పరిధిలో 231 పోస్టులకు గాను 3,063 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. 101 టీచర్‌ పోస్టులకు 2,172 దరఖాస్తులు, 130ఆయా పోస్టులకు 891దరఖాస్తులు వచ్చాయి.

ఈనెల 7నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌..

ఈనెల 7నుంచి 19వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆతర్వాత ఫిజికల్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఆ జాబితాను జీపీల్లో ప్రదర్శించి అభ్యంతరాల స్వీకరణ ఇతర ప్రక్రియ పూర్తి కావడానికి 20 నుంచి 25రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత, 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉండి, స్థానిక మహిళ అయి ఉండాలి. చివరికి ఇంటర్వ్యూల ద్వారా ఎంపికి పూర్తి చేస్తారు.

231 అంగన్‌వాడీ పోస్టులకు

3,063అర్జీలు

ఈనెల 7నుంచి 19వరకు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement