విద్యుత్‌ సరఫరాలో నాణ్యతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాలో నాణ్యతకు ప్రాధాన్యం

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

తొర్రూరు: విద్యుత్‌ సరఫరాలో నాణ్యత, భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా రియల్‌ టైం ఫీడర్‌ మానిటరింగ్‌ ద్వారా సబ్‌ స్టేషన్ల పని తీరు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. విని యోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించడమే లక్ష్యమన్నారు. సాంకేతిక సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యుత్‌ పనులు చేసే క్రమంలో భద్రతా నియమాలు పాటించాలన్నారు. తొర్రూరు పరిధిలో నూతన సబ్‌ స్టేషన్‌ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎస్‌ఈ దర్శనం, డీఈలు హీరాలాల్‌, సునీతాదేవి, అశోక్‌, ఏడీఈ అశోక్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

పెద్దవంగర: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులను బుధవారం పరిశీలించారు. మిగిలిన పనులసు త్వరితగతిన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement