విదేశీ విద్యా పర్యటనకు ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యా పర్యటనకు ఇంటర్వ్యూలు

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: విదేశీ విద్యా పర్యటనలో భాగంగా బుధవారం డీఈఓ కార్యాలయంలో త్రీమెన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 14 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారన్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు విదేశీ పర్యటనలో అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విద్యా విధానాలు, వినూత్న బోధన పద్ధతులు, విద్యారంగంలో నూతన పరిణామాలపై అధ్యయనం చేస్తారన్నారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలు

మహబూబాబాద్‌: గాంధీ చూపిన అహింస, శాంతి ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. గాంధీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 2నుంచి అక్టోబర్‌ 2వరకు నిర్వహించే గాంధీజీ మాసోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను బుధవారం కలెక్టర్‌లో ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. నాటి భారతదేశ స్వాత ంత్య్ర సంగ్రామం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ప్రజలు అహింసాయుత శాంతి మార్గాల ద్వారా విజయం సాధించారన్నారు. కార్యక్రమంలో గాంధీజీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ పరికిపండ్ల అశోక్‌, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్‌, అప్పారావు, చిత్తనూరి శ్రీనివాస్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయశాఖ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్లు విజయకుమార్‌, బాలు అన్నారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలపై హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం నుంచి వారు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రైతులు వానాకాలంలో సాగు చేసిన ఏడు సన్నరకాల వివరాల నమోదు, క్రాప్‌ బుకింగ్‌, ఆత్మ పథకం ద్వారా నిర్వహిస్తున్న రైతు శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శన వివరాలు, ప్రకృతి వ్యవసాయం శిక్షణ కార్యక్రమాలు, ఎరువుల పంపిణీ, ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ అమలుపై సమీక్షించారు. డీఏఓ ఎస్‌.విజయచంద్ర, మహబూబాబాద్‌, మరిపెడ ఏడీఏలు మురళీ, శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారులు, టెక్నికల్‌ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాలో గణేష్‌ ఉత్సవాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మహబూబా బాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గణేష్‌ ఉ త్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. విగ్రహాల ఏర్పాటు, నిబ ంధనలు, మార్గదర్శకాలను నిర్వాహకులకు ముందుగానే తెలియజేయాలన్నారు. మండల స్థాయిలో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి, విగ్రహాల ప్రతి ష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం తదితర అంశాలపై ముందస్తుగా సమన్వయం చేయాలని సూచించారు. విగ్రహ ఏర్పాటు ఏర్పాటు ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు, ట్రా ఫిక్‌ నియంత్రణ, విద్యుత్‌ భద్రత, శబ్ద కాలుష్య నిబంధనలు, ఊరేగింపు, నిమజ్జన మార్గాలపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

విద్యార్థులను తీర్చిదిద్దాలి

మహబూబాబాద్‌ రూరల్‌: పాఠశాలల విద్యార్థులు చదవడంతో పాటు రాయడంలో మెరుగుపడేలా చూడాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మహబూబాబాద్‌ మండలంలోని పెసరబండ తండా మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను డీఈఓ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన పదాలను చెబుతూ వారితో చదివించి, నల్లబల్లపై రాయించారు. జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, ఈదులపూసపల్లి జెడ్పీ హై స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వీరయ్య, పెసరబండతండా పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement