● జనహృదయ నేతకు ఘన నివాళి
మహబూబాబాద్ రూరల్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మా నుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని కొనియాడారు. 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలందరినీ ఆదుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ గుగులోత్ వెంకట్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ఎండి.హారుణ్, బానోత్ ప్రసాద్ నాయక్, రామగోని రాజు గౌడ్, బెల్లంకొండ శ్రీనివాస్, పద్మం ప్రవీణ్ కుమార్, బోడ రవి, బానోత్ భాస్కర్ పాల్గొన్నారు.


