పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తాం..

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

మహబూబాబాద్‌: పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ప్రజలు సహకరించాలని, తడి, పొడి చెత్త వేరు చేసి ఇ వ్వాలని, రోడ్లపై చెత్త వేయవద్దని మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన పారిశుద్ధ్యం, తదితర విషయాలపై సాక్షి దినపత్రికలో ‘మురుగు.. పరుగు’ అనే శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనంపై మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌ స్పందించారు. కాల్వలు శుభ్రం చేయాలని, రోడ్లపై చెత్తను తొలగించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరిని ఆదేశించారు. ఈ మేరకు కార్మికులతో పలు ప్రాంతాల్లో శుభ్రం చేయించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే పారిశుద్ధ్య సమస్య తీరుతుందని, ప్రధానంగా ప్లాస్టిక్‌ బాటిళ్లు కాల్వల్లో వేయవద్దన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు నో టీసులు ఇచ్చి శుభ్రం చేసుకోవాలని తెలియజేస్తామన్నారు. పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించి, సమస్య పరిష్కరిస్తామన్నారు. కుక్కల బెడదను అరికట్టే విషయంలో ఏబీసీ సెంటర్‌లో ఆపరేషన్ల సంఖ్య పెరిగిలా చూస్తామన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement