● కలెక్టర్ స్నేహ శబరీష్
తొర్రూరు రూరల్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. తొర్రూరు మండలంలోని జమస్థాపురం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో ఎంపికై న 70గ్రామాల్లో భూ రీ సర్వే కొనసాగుతుందన్నారు. ఆయా గ్రామాల సరిహద్దులను సరి చేస్తూ, ప్రతీ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని గుర్తించడంలో నిర్లక్ష్యం చేయవద్దని, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు, భూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏళ్లుగా భూ సమస్యలతో గ్రామీణ ప్రాంత రైతులు, ప్రజలు తరచూ గొడవలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం భూ సర్వే చేపట్టిందన్నారు. అనంతరం తొర్రూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, భూ భారతి ద్వారా చేపడుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ విక్రమ్, సిబ్బంది పాల్గొన్నారు.


