చెరువు గుంతలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువు గుంతలో పడి వ్యక్తి మృతి

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

దుగ్గొండిలో ఘటన

దుగ్గొండి: చెరువు గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ముప్పారపు రాజ మొగిలి (55) గేదె పాలు విక్రయించుకుంటూ జీవ నం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గేదెలను మేత నిమిత్తం బయటకు తోలుకెళ్లాడు. సాయంత్రానికి గేదెలు ఇంటికి చేరినా రాజమొగిలి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా రాత్రి సమయంలో గ్రామంలోని పెద్ద చెరువులోని ఓ గుంతలో మృతి చెంది కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్‌రెడ్డి బుధవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement