కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ రెక్టార్‌గా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ రెక్టార్‌గా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

వరంగల్‌ చౌరస్తా : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) రెక్టార్‌గా డాక్టర్‌ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రవీణ్‌కుమార్‌ 2017 నుంచి 2022 వరకు రెండు పర్యాయాలు కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ప్రస్తుతం నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్థీషియ విభాగం ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌ కుమార్‌కు వీసీ రమేశ్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ జె. వెంకటేశ్వర్లు, పరీక్షల నియంత్రణాధికారి వందన శుభాకాంక్షలు తెలిపారు.

వ్యవసాయ మోటారుకు పైపు బిగిస్తుండగా..

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

వావిలాలలో ఘటన

పాలకుర్తి టౌన్‌ : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జనగామ జిల్లా మండలం పాలకుర్తి మండలం వావిలాలలో చోటు చేసుకుంది. ఎస్సై దూలం పవన్‌కుమార్‌ కథనం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనపర్తి ఉపేందర్‌(49) తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కరెంట్‌ మోటారుకు పైపు బిగిస్తున్నాడు. ఈ సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న సమీప రైతులు చూసి ఈ విషయాన్ని కుటుంబీలతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి పంచానామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

యాంత్రీకరణతో

రైతుకు భరోసా..

అడ్వాంట గ్లోబల్‌ సీఈఓ భూపెన్‌ వి.దూబె

రఘునాథపల్లి: ఆధునిక, యాంత్రీకరణ, నా ణ్యమైన విత్తనోత్పత్తితోనే రైతులకు దిగుబడులు, ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని అడ్వాంట గ్లోబల్‌ సీఈఓ భూపేన్‌ వి. దూబె అన్నారు. బుధవారం మండలంలోని భాంజీపేట శివారులో అడ్వాంట కంపెనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విత్తన రంగంలో ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా సంస్థ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో గ్లోబల్‌ చీఫ్‌ సప్లయ్‌ ఆఫీసర్‌ చెరుకు రమేశ్‌, ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయ ప్రతినిధి బెళగంవార్‌, యూపీఎల్‌ సీఈఓ చెరుకు రవిశంకర్‌, జాతీయ ప్రతినిధి తుషార్‌ త్రివేది, భారతి గ్రూపు ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ బొత్స బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్‌ గైని శ్రీనివాస్‌, గొరిగ రవి, యూనిమార్ట్‌, అడ్వాంట ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement