నాణ్యమైన విద్యుత్‌ సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సేవలందించాలి

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

పాలకుర్తి టౌన్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌: క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌ ఫార్మర్ల వైఫల్యాలను నియంత్రించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి చేయాలని టీజీ ఎన్పీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పనుల పురోగతిని బుధవారం పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నా రు. వావిలాల గ్రామంలో మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో రూ. 2.97కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్‌ పాంట్‌ను పరిశీలించారు. అనంతరం పాలకుర్తి సబ్‌ స్టేషన్‌, సెక్షన్‌ కార్యాలయం, ఈఆర్‌ఓ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అలాగే, స్టేషన్‌ ఘన్‌పూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పక్కన నిర్మిస్తున్న డీఈ, ఈఆర్‌ఓ కార్యాలయాలను పరిశీలించిన అనంతరం సబ్‌స్టేషన్‌లో అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల సీఎండీ మాట్లాడుతూ డీటీఆర్‌ ఫెయిల్యూర్‌ తగ్గించాలని, లైన్లను సక్రమంగా మెయింటనెన్స్‌ చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. విద్యుత్‌ పనులు చేపట్టే ముందు ప్రతీ ఉద్యోగి కచ్చితంగా వన్‌ మినిట్‌ రూల్‌ పాటించాలన్నారు. విద్యుత్‌ లైన్ల నిర్వహణ పనుల సమయంలో ఎల్‌సీ యాప్‌ కచ్చితంగా అమలు చేయాలన్నారు. కాగా, 13 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవాలని అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి ఆనంద్‌ పాలకుర్తిలో సీఎండీకి వినతిపత్రం అందజేశారు. సీఎండీ వెంట ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, డీఈలు సారయ్య, విజయ్‌కుమార్‌, ఏడీ శ్రీధర్‌, అనూప్‌, భాస్కర్‌, ఏఓ శేఖర్‌, ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు సుమన్‌, ఆవిరినేని రణధీర్‌రావు, కొంరయ్య, శంకర్‌, శివకుమార్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్లు యాదగిరి, పెద్దిరెడ్డి, లైన్‌మన్‌లు కాల్‌రామ్‌, అన్వర్‌పాషా, సబ్‌ ఇంజనీర్లు రాకేశ్‌, రామకృష్ణ, మహేందర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లుగౌడ్‌, కాంట్రాక్టర్‌ చల్లా రఘురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement