గడువులోగా కాళేశ్వరాలయ పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా కాళేశ్వరాలయ పనులు పూర్తిచేయాలి

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

కాళేశ్వరం : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్లాన్‌, డ్రాయింగ్‌లను చూశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, దేవాలయ అధికారులతోపాటు సివిల్‌, స్టోన్‌ వర్క్‌ కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై ఈఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పనులన్నీ మే నెల చివరి వరకు పూర్తయ్యేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణంలో నాణ్యమైన కృష్ణ శిలలను తెప్పించి అవసరమైన కార్వింగ్‌ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యత, నిర్మాణ నాణ్యత, భ క్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ పనిని పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేశ్‌, పీఆర్‌ ఈఈ విద్యాసాగర్‌, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌ రెడ్డి, దేవాలయ ఈఓ మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

బాలాలయంలో పూజలు..

కలెక్టర్‌ రాహుల్‌శర్మ మొదటిసారి బాలాలయంలో కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పీఆర్‌ ఈఈ విద్యాసాగర్‌, ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, తదితరులు పాల్గొన్నారు.

పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని

వేగం పెంచాలి

జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌

రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement