స్కాలర్‌షిప్‌లు, కెరీర్‌ సేవలు.. | - | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌లు, కెరీర్‌ సేవలు..

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ.. ప్ర ముఖ స్వచ్ఛంద సంస్థ యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి. ఈ మేరకు బుధవారం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం ఆ సంస్థ సీఈఓ రేఖాశ్రీనివాసన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. మొద టి అవగాహన ఒప్పందం ప్రకారం కాకతీయ యూ ని వర్సిటీ పరిధిలో డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సులు అభ్యసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, కెరీర్‌ మార్గదర్శకత్వం, మెంటార్‌షిప్‌ సేవలు అందిచనున్నారు. టెన్త్‌, ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు కలిగి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్న విద్యార్థులు ఈస్కాలర్‌షిప్‌లకు అర్హులని రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. దివ్యాంగులు, ఆర్మీ వెటరన్స్‌ పిల్లలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ కార్యక్రమాల అమలుకు కేయూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎ. సిద్దార్థ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

‘ప్లాంట్‌ ఫర్‌ ప్లానెట్‌’ ద్వారా వెయ్యి మొక్కలు

రెండో కీలక ఒప్పందం ప్రకారం ‘ప్లాంట్‌ ఫర్‌ద ప్లానెట్‌’ ద్వారా 1000 మొక్కలతో హరిత క్యాంపస్‌గా అభివృద్ధి పరిచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కేయూలోని కోఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో ఎకరం భూమిలో 1000 మొక్కలు నాటనున్నారు. ఈ మొక్కల పరిరక్షణకు అవసరమైన ప్రహరీ ఏర్పాటుచేయడంతోపాటు నిర్వహణ బాధ్యతను ఆ స్వచ్ఛంద సంస్థ మూడేళ్లపాటు చేపట్టనుందని రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుతో యూనివర్సిటీకి ఎలాంటి ఆర్థికపరమైన భారం ఉండబోదని తెలిపారు. కేయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. రమణ, ఆ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కేయూ, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ ఎంఓయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement