ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి

మహబూబాబాద్‌: పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు . కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై కోచింగ్‌ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని యువత పోలీస్‌ ఉద్యోగాలు సాధించేందకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎంతో చక్కటి ఉచిత కోచింగ్‌ అందిస్తున్నారన్నారు. అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఎస్పీ శబరీష్‌ మాట్లాడుతూ.. ఉచిత కోచింగ్‌ శిబిరం అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అభ్యర్థులు నిరుత్సాహ పడకుండా కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్నారు. రాష్ట్రంలోనే మానుకోట జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో యువత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, పోలీస్‌ అధికారులు, 500 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement