ఇప్పపువ్వు లడ్డూల తయారీ, విక్రయాలతో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తోంది. నెలకు సుమారు రూ.10 వేలకుపైగా ఆదాయం వస్తోంది. సంఘానికి వారానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం సమకూరుతోంది. లడ్డూల తయారీకి అయ్యే ఖర్చులు పోనూ.. ఒక్కో సభ్యురాలికి వారానికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం లభిస్తోంది. దీంతో కుటుంబానికి ఆసరా ఉండడంతోపాటు సొంతంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం కలుగుతోంది.
– శాంతమ్మ, ఆదివాసీ మహిళా
సంఘం సభ్యురాలు
●


