బెటాలియన్‌ కమాండెంట్‌గా లక్ష్మీకాంతరావు | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌ కమాండెంట్‌గా లక్ష్మీకాంతరావు

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరిధి చల్వాయిలోని 5వ బెటాలియన్‌ (టీజీఎస్పీ) నూతన కమాండెంట్‌గా సీవీ.లక్ష్మీకాంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వర్తించిన ఆయన అంకితభావం, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమైన మాట్లాడారు. బెటాలియన్‌లో క్రమశిక్షణ, సమన్వయం, విఽధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బెటాలియన్‌ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన కమాండెంట్‌కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సహాయక కమాండెంట్లు పీకే ప్రసాద్‌, ధర్మారావు, ఆర్‌ఐలు కిరణ్‌ కుమార్‌, భాస్కర్‌, స్వామి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

క్షయ నివారణ కేంద్రం సందర్శన

కాశిబుగ్గ: కేఎంసీలోని క్షయ నివారణ కేంద్రాన్ని హనుమకొండ ట్రెయినీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ టి.రోహిత్‌ నేత గురువారం సందర్శించారు. ఈసందర్భంగా క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్‌ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానం గురించి ఇన్‌చార్జ్‌ టీబీ నివారణ అధికారి డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డి వివరించారు. అదేవిధంగా ఓపీ పేషెంట్ల సేవలు, ట్రునాట్‌ ల్యాబ్‌ గురించి తెలిపారు. కార్యక్రమంలో టీబీ, కల్చర్‌ ల్యాబ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement