ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

న్యూశాయంపేట: ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు టీజీఓ సంఘం అండగా ఉంటుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. హనుమకొండలోని వరంగల్‌ క్లబ్‌లో గురువారం జరిగిన తెలంగాణ గెజిటెట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై టీజీఈ జాక్‌ ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా తహసీల్దార్‌ పీఎస్‌.ఫణీకుమార్‌, కార్యదర్శిగా డాక్టర్‌ రాజేష్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్యాం , సమావేశంలో సహాధ్యక్షులు ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, శేషు, రవిప్రసాద్‌, ప్రేమలత, పవిత్ర, హేమలత, స్వాతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, కోశాధికారి రాజేష్‌కుమార్‌ సెంట్రల్‌ అసోషియేషన్‌ కార్యదర్శులు కిరణ్‌కుమార్‌, కే.రాజేష్‌కుమార్‌, ఏ.శ్రీనివాస్‌, మాధవరెడ్డి, రఘుపతిరెడ్డి, రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement