కాజీపేట రూరల్: ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్ మీదుగా రైల్వేశాఖ ధానాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు–ధానాపూర్ మధ్య డైలీ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ గురువారం తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ధానాపూర్‌లో బయల్దేరే ధానాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22365) వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 19ః00 గంటలకు వరంగల్ చేరుతుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఎస్‌ఎంవీటీ బెంగళూరులో బయల్దేరే ఎస్‌ఎంవీటీ బెంగళూరు–ధానాపూర్ (22366) వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 18ః18 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. ఈ రైళ్లకు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరులో హాల్టింగ్ కల్పించారు.


