పోలీసు వలయంలో పాలిటెక్నిక్‌ కళాశాల | - | Sakshi
Sakshi News home page

పోలీసు వలయంలో పాలిటెక్నిక్‌ కళాశాల

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

వరంగల్‌ చౌరస్తా : విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కళకళలాడే వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు గురువారం పోలీసుల నిర్భంధంలో చేరాయి. గత కొద్ది రోజులుగా పాలిటెక్నిక్‌ విద్య, ఉన్నత చదువులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు, పీపీపీ విధానంతో వేతనాల్లో కోత అనే ఆవేదనతో అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు పాలిటెక్నిక్‌ను సందర్శించి, విద్యార్థులకు సంఘీభావం ప్రకటించే పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మట్టెవాడ పోలీసులు ఉదయమే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. ఎంజీ ఎం రోడ్డులో గేట్‌ మూసి వేయించారు. భద్రకాళీ అర్చీ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ వాహనాల రాకపోలను నిలువరించారు. కళాశాల విద్యార్థులను ముగ్గురు, నలుగురు చొప్పున లోనికి అనుమతించారు. కళాశాలలో ఎలాంటి ఆందోళన చేపట్టకూడదని అధ్యాపకులు, విద్యార్థులకు హెచ్చరికలు చేశారు. విద్యార్థులను కలిసేందుకు కాలేజీకి వచ్చే కుటుంబ సభ్యులను నిరాకరించారు. హరీశ్‌రావు పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌ నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డి అక్కడి చేరుకోగా వెనక్కి పంపించారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు డాక్టర్‌ హరీ రమాదేవి, నాయకులు రంజిత్‌, కొండకండ్ల సదాంత్‌, వడిచర్ల ప్రసాద్‌, ఇజ్జగిరి బీమ్‌ రాజ్‌, గొర్రె విజయ్‌, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద హరీశ్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన పర్యాటన రద్దయింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పాలిటెక్నికల్‌ కాలేజీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బందోబస్తులో సీఐలు వెంకటేశ్వర్లు, సుజాత, ఎస్‌ఐ శివకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

పలువురు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement