జనగామ: జనగామ పట్టణంలోని కురుమవాడలో గురువారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సదానందానికి చెందిన పండ్ల గోదాంలో ప్లాస్టిక్ ట్రేలతో నింపి ఉంచిన మూడు ట్రాలీ ఆటోల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు సుమారు 10 నుంచి 18 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడటంతో సమీప కాలనీ వాసులు భయాందోళనకు బయటకు పరుగులు తీశారు. గమనించిన స్థానికుడు సదాశివుడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే మూడు ట్రాలీ ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు సమీప ఇళ్లకు వ్యాపించే ప్రమాదం ఉండడంతో స్థానికులు బిందెలు, ఇతర సామగ్రితో నీళ్లు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ.. మూడు ఆటో ట్రాలీలు దగ్ధమయ్యాయి. స్థానికులు బొలోరో వాహనాన్ని ఆహుతి కాకుండా కాపాడగా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఓ ఆటోలోని బ్యాటరీ పేలడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
మూడు ట్రాలీ ఆటోలు దగ్ధం
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం


