వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా క్రికెట్ జట్ల ఎంపికలు గురువారం కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మందికి పైగా మహిళా క్రికెటర్లు ఎంపికలో పాల్గొన్నట్లు డబ్ల్యూడీసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. హెచ్‌సీఏ సెలెక్టర్లు సునీత ఆనంద్, అన్నా మరియా, రేవతి హాజరై ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రికెటర్లు హెచ్‌సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా త్వరలో జరగనున్న వివిధ ఫార్మాట్ లీగ్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ ప్రతినిధులు రవికుమార్ రెడ్డి, వెలిశాల నిశాంత్‌రావు, డబ్ల్యూడీసీఏ సభ్యులు భరణి తోట రాము, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్ పాల్గొన్నారు.


