రోస్టర్‌ విధానాన్ని సవరించాలి | - | Sakshi
Sakshi News home page

రోస్టర్‌ విధానాన్ని సవరించాలి

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

తొర్రూరు: మాలల రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న రోస్టర్‌ విధానాన్ని సవరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య డిమాండ్‌ చేశారు. డివిజన్‌ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బుధవారం మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రశాంత్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడారు. ప్రస్తుత రోస్టర్‌ విధానంతో గ్రూప్‌–3లోని మాలలతో పాటు ఇతర 25 కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం–2025 రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రోస్టర్‌ విధానంతో విద్యాసంస్థల ప్రవేశాలు, ఉద్యోగాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. మాల ఎమ్మెల్యేలు ఈ అన్యాయంపై మౌనం వహించడం సరికాదన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా రాకేష్‌ ఎన్నిక..

మాల మహానాడు జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా యనమల రాకేష్‌, వర్కింగ్‌ ప్రైసిడెంట్‌గా గుండాల బిక్షం, డోర్నకల్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొప్పుల శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. వారికి చెన్నయ్య నియామక పత్రాలు అందించారు. సమావేశంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ సభ్యురాలు పంజా కల్పన, రాష్ట్ర కార్యదర్శులు దాసరి ప్రకాష్‌, గుర్రాల లింగన్న, నాయకులు పప్పుల వెంకన్న, ప్రేమ్‌, గుండాల బిక్షం, కొప్పుల శ్రీనివాస్‌, సంజీవరావు, రమేష్‌ పాల్గొన్నారు.

మాల మహానాడు జాతీయ

అధ్యక్షుడు చెన్నయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement