యాప్‌తో ఉపయోగాలు.. | - | Sakshi
Sakshi News home page

యాప్‌తో ఉపయోగాలు..

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

యాప్‌తో ఉపయోగాలు..

ఈ యాప్‌లో ఈ–కేవైసీ పూర్తయిన తర్వాత సంఘం, సభ్యురాలు వివరాలన్నీ వివరంగా పొందుపర్చి ఉంటాయి. రుణాలు తీసుకునే సందర్భంలో బ్యాంకర్లకు సులభం అవుతుంది. అలాగే సభ్యులే రుణాలు తీసుకుంటున్నారా.. ఒకరి బదులు మరొకరు తీసుకుంటున్నారా అనేది తెలుస్తుంది. సంఘం పొదుపు, రుణాలు, వాయిదాలు, తిరిగి చెల్లింపుల వివరాలు నమోదు అవుతాయి. దీంతో సభ్యురాలు తీసుకున్న రుణం, చెల్లించిన డబ్బులు, ఎంత బాకీ ఉన్నది తెలిసిపోతుంది. దీంతో రుణాల చెల్లింపులో జాగ్రత్త వహించడం, నిరక్షరాస్యుల నుంచి ఎక్కువ మొత్తంలో తీసుకొని మోసం చేసే అవకాశం లేదు. మహిళల జీవనోపాధి వివరాల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందే అవకాశం సులభం అవుతుంది. అలాగే ఒకే సంఘం పేరున వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. సంఘాల పురోగతి, మొండి బకాయిలు ఉన్నతాధికారులు తెలుసుకోవడం సులభం. దీంతో పర్యవేక్షణ పెంచడం, అవసరమైతే మార్పులు చేయడం, అక్రమాలకు పాల్పడిన వారు ఇట్టే దొరికిపోయే అవకాశం ఉన్నందున వారిపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement