‘ఓపెన్‌ స్కూల్‌’తో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌ స్కూల్‌’తో ఉజ్వల భవిష్యత్‌

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

కావాల్సిన పత్రాలు..

వయోపరిమితి..

కాళోజీ సెంటర్‌ : చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. నియత పాఠశాలలో పదో తరగతి వరకు కుటుంబ, ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన (డ్రాపౌట్స్‌) వారికి మళ్లీ విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 31 చివరి గడువు. ఇందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

14,660 మంది విద్యార్థుల అడ్మిషన్లే టార్గెట్‌..

డ్రాపౌట్స్‌ విద్యార్థులను, గ్రామీణ యువత, సీ్త్ర, పురుషులు మళ్లీ చదువు వైపు మళ్లించేందుకు ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 14,660 మంది విద్యార్థులను అడ్మిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

వయస్సుతో సంబంధం లేదు..

వయస్సుతో సంబంధం లేకుండా చదువు ఆపేసిన వారు, ఉద్యోగాలు లేదా పనులు చేసుకుంటున్నవారు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా తమ విద్యను కొనసాగించొచ్చు. వెంటనే సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

బోధన మాధ్యమం ఎంపిక..

● పది, ఇంటర్‌లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఏదేని ఒక మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

● అభ్యాసకులు గ్రూప్‌ లిస్టులో ఇచ్చిన ఏ సబ్జెక్టు కాంబినేషన్‌ను అయినా స్కీం ఆఫ్‌ స్టడీలో ఇచ్చిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్‌లో గ్రూప్‌–ఏలో ఇంగ్లిష్‌ తప్పనిసరి.

పదో తరగతికి అడ్మిషన్‌ ఫీజు ఇలా..

● పదో తరగతికి రిజిస్ట్రేషన్‌ ఫీజు (అందరికీ) రూ.150

● ఐదు సబ్జెక్టులకు రూ.1,400 (ప్రతీ అదనపు సబ్జెక్టుకు రూ.200

● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనిక ఉద్యోగ పిల్లలు, ట్రాన్స్‌జెండర్‌, అన్ని వర్గాల మహిళలు ప్రతీ ఐదు సబ్జెక్టులకు రూ.1,000మాత్రమే.

ఇంటర్మీడియట్‌కి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.300

● ఐదు సబ్జెక్టులకు రూ.1,500 (ప్రతీ అదనపు సబ్జెక్టుకు రూ.300)

● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనిక ఉద్యోగ పిల్లలు, ట్రాన్స్‌జెండర్‌, అన్ని వర్గాల మహిళలు ప్రతీ ఐదు సబ్జెక్టులకు రూ.1,200మాత్రమే.

చదువు ఆపిన వారికి సువర్ణావకాశం

ప్రారంభమైన అడ్మిషన్లు.. ఈనెల 31 చివరి గడువు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,660 మంది ప్రవేశాలే లక్ష్యం

పదో తరగతిలో ప్రవేశానికి మున్సిపల్‌, తహసీల్దార్‌, జిల్లా జనన, మరణ రిజిస్ట్రార్‌ జారీ చేసిన పుట్టిన తేదీ అటెస్టెడ్‌ కాపీ ఉండాలి.

కనీస విద్యార్హతలు ఏమి లేకపోతే అభ్యాసకుడు తాను పదో తరగతి చదవగలిగే పరిజ్ఞానం కలిగి ఉన్నాననే సొంత ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వాలి.

జిల్లా వారీగా టార్గెట్‌ వివరాలు (2026–27)..

జిల్లా పదో ఇంటర్మీ మొత్తం

తరగతి –డియట్‌ లక్ష్యం

వరంగల్‌ 840 1,304 2,144

హనుమకొండ 589 1,762 2,351

జనగామ 1231 2,906 4,137

మహబూబాబాద్‌ 710 1,206 1,916

జేఎస్‌ భూపాలపల్లి 522 865 1,387

ములుగు 1,254 1,471 2,725

మొత్తం 5,146 9,514 14,660

పదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల చివరి నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి ఏమి లేదు.

ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈ నెల చివరినాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

సొసైటీ సువర్ణావకాశం కల్పిస్తుంది

చదువుకోవాలనే కోరిక ఉన్న వారికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ విద్యావకాశాన్ని కల్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అధ్యాయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యాసకులకు అనుకూలమైన కేంద్రంలో అడ్మిషన్‌ పొందొచ్చు. ఈనెల 29 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

– అనగోని సదానందం, ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement