మట్టి తవ్వకాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకాలు ప్రారంభం

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ లో భాగంగా మట్టి తవ్వకాలు నైరుతి మూల నుంచి బుధవారం ప్రారంభించారు. ప్రస్తుత నిర్మాణ ప్రాకారానికి 12 ఫీట్లతో లోతు నుంచి ప్రొక్లైనర్‌తో తవ్వకాలు చేపట్టారు. అంతకు ముందు శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆల యం ఉన్న చోట 12 ఫీట్ల మేర తవ్వకాలు చేపట్టారు. అక్కడ పునాదిలో రాళ్లు బయటపడ్డాయి. భూమిలోతు కోసం కొంత మేర మట్టి తీశారు. దీంతో రాతి నిర్మాణాలకు అడుగు పడింది. త్వరలో మార్కింగ్‌ ఇచ్చి నిర్మాణాలకు నాంది పలకనున్నారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ దేవేందర్‌ పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement