సమస్యలపై సమరభేరి.. | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై సమరభేరి..

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

ప్రధాన డిమాండ్లు..

ఉద్యమ కార్యాచరణ..

హన్మకొండ అర్బన్‌/జనగామ : సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల సాధనకు రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు భారీ ఎత్తున మహా ధర్నాలు నిర్వహించనున్నారు. పీఆర్‌సీ అమలు, డీఏ విడుదల, సీపీఎస్‌ రద్దు, ఉచిత ఆరోగ్య పథకంతోపాటు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపుల కోసం ఉద్యోగ లోకం పోరాటానికి సిద్ధమయ్యారు. జేఏసీ పిలుపుతో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిరసనలకు సర్వం సిద్ధమవ్వగా, సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.

రెండేళ్లకు పైగా ఎదురుచూపులు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ల తొమ్మిది నెలలు గడుస్తున్నా ఉద్యోగులు, పెన్షనర్ల ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదలపై ప్రభుత్వం సానుకూల ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, మెడికల్‌, సరెండర్‌ లీవ్‌ తదితర బిల్లులు మంజూరు కావడం లేదని పేర్కొంటున్నారు. రూ.వేల కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో ఉద్యోగులతో పాటు రిటైర్డ్‌ సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హామీలకే పరిమితం..

ప్రభుత్వ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన సమయాల్లో హామీలు లభించినా, అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. రెండో వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ) నివేదిక రాకపోవడం, డీఏల బకాయిలు పేరుకుపోవడం, నూతన ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) అమల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వద్ద ఎదురవుతున్న అవస్థలు ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్నాయి. ఇకపై మాటలతో సరిపెట్టకుండా, నిరసనలు, కార్యాచరణ ద్వారానే తమ హక్కులు సాధించుకోవాలని జేఏసీ నేతలు తీర్మానించారు.

హక్కుల కోసం

నేడు ఉద్యోగ లోకం మహా ధర్నా

సమస్యల సాధనకు దశలవారీ ఉద్యమం

పీఆర్సీ, డీఏ, ఓపీఎస్‌ కోసం పోరాటం

సీపీఎస్‌ రద్దు,

ఓపీఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌

రెండో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)

నివేదికను సత్వరమే అమలు చేయాలి.

నిలిచిపోయిన ఆరు విడతల కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమన (డీఆర్‌) బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

సీపీఎస్‌ పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్‌విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలి.

ఉద్యోగులకు, పెన్షనర్లకు క్యాష్‌లెస్‌ వైద్యం

అందించేలా నూతన ఆరోగ్య పథకాన్ని

సక్రమంగా అమలు చేయాలి.

ఆగస్టు 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులతో మహాధర్నాలు.

27 నుంచి ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం.

సెప్టెంబర్‌ 1న సీపీఎస్‌కు నిరసనగా ‘పెన్షన్‌ విద్రోహ దినం’ నిర్వహణ.

సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో మహాధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement