కోళ్ల పరిశ్రమలకు ‘రేషన్‌’.. | - | Sakshi
Sakshi News home page

కోళ్ల పరిశ్రమలకు ‘రేషన్‌’..

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

హసన్‌పర్తి : పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ... దందా మాత్రం ఆగడం లేదు. యథేచ్ఛగా సాగుతోంది. గతంలో అక్రమార్కులు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే వారు. అయితే ఇప్పడు కాస్తా రూట్‌ మార్చి చేశారు. పీడీఎస్‌ బియ్యాన్ని కోళ్ల పరిశ్రమలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు కూడా ఈవిషయాన్ని అంగీకరించారు.

హసన్‌పర్తి, చింతగట్టు,

కోమటిపల్లి కేంద్రంగా దందా..

హసన్‌పర్తి, చింతగట్టు, కోమటిపల్లి కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు ఉన్నతాధికారుల గుర్తించారు. హసన్‌పర్తి మండల కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు సుమారు 206.70 క్వింటాళ్ల బియ్యం సీజ్‌ చేశారు. వీటి విలువ సుమారు రూ.7,21,450 ఉంటుందని అధికారులు తెలిపారు.

నూకలుగా చేసి కోళ్లకు దాణాగా ..

హసన్‌పర్తి మండల కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 84 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం లభ్యయయ్యాయి. గోదాం నుంచి బియ్యం తరలిస్తున్న క్రమంలో దాడులు నిర్వహించారు. అలాగే, అదేరోజు కోమటిపల్లి తండాలో కూడా దాడులు నిర్వహించి సుమారు 45 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం(ఈ నెల 23న) మధు తండాలో దాడుల సందర్భంగా 77,70 క్వింటాళ్ల బియ్యం సీజ్‌ చేశారు. వివిధ ప్రాంతాల్లో రూ.15 నుంచి రూ.20కు బియ్యం సేకరించి.. ఆ బియాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో రూ.30నుంచి రూ.35 విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డీలర్లే బియ్యాన్ని బ్లాక్‌ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హసన్‌పర్తి నుంచి సిద్దిపేటకు బియ్యం తరలివెళ్తోంది. ఇక్కడ ఉన్న ఆయా కోళ్ల పరిశ్రమల్లో బియ్యాన్ని విక్రయిస్తున్నారు. అక్కడ సదరు వ్యాపారి ఈ బియ్యాన్ని నూకలుగా చేసి కోళ్లకు దాణగా వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

దాణాగా తరలిస్తున్న అక్రమార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement