నయీంనగర్: రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు రమేశ్‌చందర్ మాట్లాడుతూ.. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ప్రజా సంఘాలపై ఉన్న అక్రమ కేసులు రద్దు చేయాలని, ఉపా చట్టం రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ పార్టీల రాజకీయ కార్యకర్తలు దేశంలో వేలాదిగా జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. ఉద్యమ పార్టీలు లేనప్పుడు, ఉద్యమాల పేరుతో బందీలుగా ఉన్న రాజకీయ నాయకులను బేషరతుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక ప్రయోజనం కోసం బాధ్యతగా వ్యవహరించిన వాళ్లందరినీ కూడా రాజకీయ ఖైదీలుగానే గుర్తించాలన్నారు. ఉద్యమపార్టీ లేని సందర్భంలో గతంలో నమోదు చేసిన ఉపా కేసులన్నీ కూడా అన్యాయమైనవి, అక్రమమైనవన్నారు. కార్యక్రమంలో సీఎల్‌సీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ జయంత్, ప్రధాన కార్యరద్శి పాణి, వివిధ ప్రజాసంఘాల నాయకులు రమాదేవి, బాలరాజు, అప్పారావు, రాజేందర్, కుమారస్వామి, సుధాకర్, దయాకర్, ప్రవీణ్‌కుమార్, రంజిత్ పాల్గొన్నారు.


