పీజీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

పీజీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 29న నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ తెలిపారు. మిగతావి షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 29న వాయిదా వేసిన ఆ పరీక్షలు మళ్లీ సెప్టెంబర్‌2న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. హైకోర్టు ప్రాసెస్‌ సర్వర్‌ పరీక్షల నేపథ్యంలో 29న జరగాల్సి న పరీక్షలను వాయిదావేశామని తెలిపారు. పూర్తి వివరాలకు కేయూ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కాకతీయ.ఏసి.ఇన్‌లోచూడాలన్నారు.

పెరుగుతున్న

గోదావరి ప్రవాహం

వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి ప్ర వాహం క్రమేనా పెరుగుతోంది. మంగళవారం సా యంత్రం 14.20 మీటర్లకు చేరుకున్న వరద ప్రవా హం రహదారులకు సమానంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రా మాల మధ్య ఉన్న ఇసుక వాగు బ్రిడ్జి వద్ద నిర్మించిన డైవర్షన్‌ రోడ్డుపైకి చేరింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేసి చిన్న వాహ నాలను పంపిస్తున్నారు. సంబంధిత అధికారులు జీపీతోపాటు ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు.

అర్హుడైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండాలి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి టౌన్‌: ప్రతీ బూత్‌లో జాబితాను క్షణ్ణంగా పరిశీలించి అర్హుడైన ప్రతీ ఓటరుకు న్యాయం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు సర్‌ ఫేజ్‌–2పై మంగళవారం మండల కేంద్రంలో ‘వి’ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన బీఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నాయకుల ముఖ్య సమావేశంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ‘సర్‌’ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల డీసీసీ అధ్యక్షులు లకావత్‌ ధన్వంతి, డాక్టర్‌ ఉమ, అయూబ్‌ ఖాన్‌ పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి బీఎల్‌ఏ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ బూత్‌లో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొత్త ఓటరు నమోదు, తొలగించిన పేర్లు, పునరుద్ధరణ, చిరునామా మార్పులు, ఇతర సవరణలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సర్‌ కోఆర్గినేటర్‌ నజీర్‌ , అసెంబ్లీ కోఆర్డినేటర్‌ ప్ర మోద్‌, తదితరులు పాల్గొన్నారు,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement