మరిపెడ రూరల్: మరిపెడ మున్సిపాలిటీలో చేపట్టిన అంతర్గత రోడ్డు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని 7వ వార్డు పరిధి శ్రీరామవిలాస్ కాలనీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పానుగోలు రాంలాల్, కాలం రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ జాటోతు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ఉపేందర్, భిక్షపతి, రవికాంత్, గుండగాని వెంకన్న, లచ్చిరాం, కరణ్‌సింగ్ పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ డీఈగా కృష్ణ బాధ్యతల స్వీకరణ
తొర్రూరు: డివిజన్ కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా ఎన్.కృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఈ కృష్ణ మాట్లాడుతూ.. డివిజన్‌లో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా.. వాటి పరిష్కారానికి నిరంతరం చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తామన్నారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యార్థులు, యువకులు కొందరు స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని, చెడు వ్యసనాలకు దూ రంగా ఉండాలని, ఇష్టపడి చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. న్యాయవాదులు మల్లారెడ్డి, రాజ్‌కృష్ణ, ఆనంద్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ప్రవీణ్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు వాసిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మంగళవారం ఎన్నికయ్యారు. ప్రవీణ్‌రెడ్డి తొర్రూరు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు డీఈఓ సత్యనారాయణమూర్తి ఆయనకు నియామక పత్రం అందజేశారు.
ఆరుతడి పంటలను
సాగు చేయాలి
కురవి: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వచ్చే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందన్నారు. ఆరుతడి పంటలైన పెసలు, మినుములు, కందుల, నువ్వులు, ఆముదం వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. మిషన్ వైవిధ్యం పథకం కింద ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్‌రావు, ఏఓ నరసింహారావు, ఏఈఓ రాజేశ్వరి, పశువైద్య అధికారి టి.రాజేందర్, నీటిపారుదల శాఖ ఏఈ కవిత, అంబటి వీరభద్రం, జక్కుల నాగన్న పాల్గొన్నారు.


