కుష్టు వ్యాధి నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కుష్టు వ్యాధి నివారణకు చర్యలు

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌

నెహ్రూసెంటర్‌: కుష్టువ్యాధి రహిత జిల్లాగా మానుకోటను ముందు వరుసలో నిలపాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం కుష్టువ్యాధి నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని కుష్టు వ్యాధిగ్రస్తులకు మందులు అందజేస్తామని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనుమానితులను సమీపంలోని పీహెచ్‌సీ వెద్యాధికారి వద్దకు పంపాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది కుష్టును తరిమికొట్టేలా తమవంతుగా కృషి చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అర్జున్‌, డీపీఎంఓలు సతీష్‌రెడ్డి, వాల్యా, డెమో రాజ్‌కుమార్‌, నోడల్‌ పర్సన్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement