క్రీడాకారులకు భోజనం పెట్టేదెలా? | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు భోజనం పెట్టేదెలా?

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని చెప్పే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. సభ వేదికలపై ఊకదంపుడు మాటలతో ఉత్తేజపరుస్తూ, క్రీడాకారులకు అందించే భోజన వసతుల అంశంలో నిరుత్సాహ పరుస్తున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు హనుమకొండలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం చొరవ తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఎట్టకేలకు జేఎన్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ను ప్రారంభించారు.

ఈ ఏడాది 5వ తరగతి..

హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గతేడాది ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన తెలంగాణ క్రీడా పాఠశాలను నిధుల కొరత వేధిస్తోంది. మొదటి విద్యా సంవత్సరం కేవలం 4వ తరగతితో ప్రారంభమైన ఈ స్కూల్‌, ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి కొనసాగుతుంది.

జీఓ లేదు.. రూపాయి రాలేదు

జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఇప్పటి వరకు ప్రభుత్వం జీఓ జారీ చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్‌ నిర్వహణకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కా కపోవడం విశేషం. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ కు సంబంధించిన నిధులతోనే స్పోర్ట్స్‌ స్కూల్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పేరుకుపోతున్న బకాయిలు..?

జేఎన్‌ఎస్‌లో గతేడాది 4వ తరగతిలో మొదటి విద్యా సంవత్సరం సందర్భంగా 49 మంది బాలబాలికలకు ప్రవేశాలు కల్పించి క్రీడాపాఠశాలను ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి రూ.180 చొప్పున, గతేడాది మెస్‌కు చెల్లించాల్సిన బకాయి సుమారు రూ.15లక్షలు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్న ఇప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం గమనార్హం.

డైట్‌ మెనూ

ఉదయం: 5:30 టీ, బిస్కెట్లు

8:00 రోజు గుడ్డు, పాలు, అరటిపండుతో పాటు ఒక్కో రోజు చపాతీ, పూరీ, ఉతప్ప, ఇడ్లీ, ఉప్మా, బ్రెడ్‌జామ్‌

మధ్యాహ్నం: అన్నం, వెజ్‌ కర్రీ, సాంబార్‌, పెరుగు, అప్పడం

సాయంత్రం : 5:30 టీ, బిస్కెట్లు, రెండు

చపాతీలు, పప్పు

రాత్రి : వారంలో ఒక్కోరోజు చికెన్‌, మటన్‌, చేపలు, రసం, గుడ్లతో అన్నం, స్వీటు

త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం..

గతేడాది పెండింగ్‌లో ఉన్న స్పోర్ట్స్‌ స్కూల్‌ మెస్‌ బిల్లు ఫైళ్లను తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీకి పంపించాం. అక్కడి ఉన్నతాధికారులు బకాయి చె ల్లించేందుకు కసరత్తు చేశారు. ఒకటి, రె ండ్రోజుల్లో బకాయి బిల్లులు చెల్లిస్తాం.

– ప్రశాంత్‌, డీవైఎస్‌ఓ,

హనుమకొండ

పెండింగ్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌ మెస్‌ బిల్లు

మొదటి ఏడాది బకాయి రూ.15 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement