● వరంగల్ ఎంపీ కడియం కావ్య
న్యూశాయంపేట : హనుమకొండలోని కాకతీయ జువాలజికల్ పార్క్ అభివృద్ధికి కంపా(కాంపెన్సెటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటి) నిధులు మంజూరు చేయాలని మంగళవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య న్యూఢిల్లీలో కేంద్ర జూ అథారిటి సభ్య కార్యదర్శి డాక్టర్ వి.క్లెమెంట్ బెన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జూ పార్క్‌లో సింహాల ఎన్‌క్లోజర్, నైట్‌షెల్టర్, హైనా, జూకల్, వైల్డ్‌డాగ్ ఎన్‌క్లోజర్లు నైట్ షెల్టర్లు, సరీసృపాల ఎన్‌క్లోజర్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తెలంగాణ అటవీశాఖ ఇప్పటికే కేంద్ర జూ అథారిటికి సమర్పించిందని ఎంపీ గుర్తు చేశారు. ఎంపీ వినతిపై అథారిటి కార్యదర్శి సానుకూలంగా స్పందించారని, జూ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కడియం కావ్య వెల్లడించారు.


