● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడలతో మానసికోల్లాసం కలిగి నూతనోత్సాహాన్ని నింపేందుకు దోహదపడుతాయని, అందుకే సంస్థలో శ్రమించే ప్రతీ ఉద్యోగి క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటీ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండ్రోజుల పాటు జరగనున్న ఉద్యోగులకు క్రీడా పోటీలను సీఎండీ వరుణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా రెడ్డిపురంలోని క్రికెట్ గ్రౌండ్‌లో ఉద్యోగులు, క్రీడాకారులతో కలిసి సీఎండీ వరుణ్‌రెడ్డి క్రికెట్, క్యారమ్ ఆడారు. డైరెక్టర్లు మోహన్‌రావు, తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, సీఈలు, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు మాధవరావు, వేణు బాబు, హేమంత్ కుమార్, స్పోర్ట్స్ అధికారి జగన్నాథ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


