డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లపై చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

డిఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లపై చర్యలు తప్పవు

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: డిఫాల్ట్‌ రైస్‌ మిల్ల ర్లపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం సీఎంఆర్‌ తదితర విషయాలపై సంబంఽధిత అధికారులు, మిల్లర్లతో అదనపు కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ గడువులోగా పెట్టాలని చెప్పారు. సీఎంఆర్‌ విషయంలో ఆలస్యం చేయవద్దన్నారు. బియ్యం సరఫరా సజావుగా కొనసా గేందుకు రైస్‌మిల్లర్లు జిల్లా యంత్రాగానికి పూర్తి సహకారం అందించాలన్నారు. సమావేశంలో సివిల్‌ సప్లయీస్‌ డీఎం నర్సింహారావు, డీసీఎస్‌ఓ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement