ఉమ్మడి జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు ఇలా..(2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు)
2024
2026
ఆధార్
అనుసంధానమైనవి
యాక్టివ్ ఖాతాలు
రూపే కార్డులు
సోర్స్: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం
గార్ల: మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో కొత్తగా ఐదుగురు స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరినట్లు డీసీహెచ్‌ఎస్ రమేశ్ తెలిపారు. మంగళవారం సీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్పెషలిస్ట్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో మొత్తం 9మంది స్పెషలిస్ట్ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో నూతనంగా గైనకాలజిస్ట్ మౌనిక, పిడియాట్రిక్ ప్రదీప్, అనస్తీసియా మనీషా, డాక్టర్ వైశాలిరెడ్డి విధుల్లో చేరినట్లు తెలిపారు. ప్రతీరోజు రాత్రి సమయంలో ఒక నైట్ డ్యూటీ డాక్టర్ కచ్చితంగా విధుల్లో ఉండాలని వైద్యులకు సూచించారు. వైద్య పరికరాలు రాగానే రోగులకు అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో సరిపడా డాక్టర్లు, సిబ్బంది ఉన్నందున ప్రతీ నెల 20 డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమష్టిగా పనిచేస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. తర్వాత సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా సీనియర్ డాక్టర్ నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ఏఓ స్వాతికుమార్, సీనియర్ అసిస్టెంట్ కిశోర్, నర్సింగ్ ఆఫీసర్స్ స్వాతి, మెర్సీ, ఝాన్సీరాణి, రాణి, ఎంఎన్‌ఓ బైరపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


