విశ్రాంత ఆచార్యుల సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

విశ్రాంత ఆచార్యుల సేవలు అభినందనీయం

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

కాకతీయ వర్సిటీకి

ఏమి చేయలేక పోయా: కడియం

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో విశ్రాంత ఆచార్యులు అందించిన సేవలు అభినందనీయమని కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (కుర్తా) ఆధ్వర్యంలో సెనెట్‌ హాల్‌లో నిర్వహించిన కేయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు, విశ్రాంత ఆచార్యుల సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కేయూ అధ్యాపకులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయం బ్లాక్‌ గ్రాంటును రూ.90కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు పెరిగిందన్నారు. రూసా నిధులు రూ.50కోట్లతో అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నామన్నారు.132 మంది పార్ట్‌టైం అధ్యాపకుల నియమకాలు చేపడుతున్నామని, భవిష్యత్‌లో రెగ్యులర్‌ అధ్యాపకుల నియమాకాలు చేపడుతామన్నారు. కేయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పొడువునా సీనయర్‌ అధ్యాపకులు, ఉద్యోగుల సహాకారంతో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కుర్తా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సదానందం మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగానే కాకతీయ యూనివర్సిటీ 1976 ఆగస్టు 19న ఆవిర్భవించిందన్నారు. కుర్తా జనరల్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేయూ కెమిస్ట్రీ విశ్రాంత ఆచార్యులు సీతారామారావు, కేయూ మాజీ వీసీ విశ్రాంత ఆచార్యులు విద్యావతి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సీనియర్‌ విశ్రాంత ఆచార్యులు ఎం.కిష్టయ్యను వీసీ ప్రతాప్‌రెడ్డి, కుర్తా బాధ్యులు శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో తెలుగు అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.వెంకటనారాయణ, కుర్తా కోశాధికారి ప్రొఫెసర్‌ జి.వీరన్న, జాయింట్‌ సెక్రటరీ కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని రూపొందించిన సావనీర్‌ను వీసీతో పాటు కుర్తా అధ్యక్షుడు సదానందం, జనరల్‌సెక్రటరీ ప్రొఫెసర్‌ రవీందర్‌ ఇతర బధ్యులు ఆవిష్కరించారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కూడా కాకతీయ యూనివర్సిటీకి ఏమి చేయలేక పోయాననే బాధ ఎప్పటికి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యికిపైగా అధ్యాపక పోస్టులు మంజూరు చేసినా వివిధ కారణాలతో అప్పటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదన్నారు. కేయూ అభివృద్ధి పనులకు రూ.50కోట్లు మంజూరు చేయించాను, కానీ అవి వినియోగం కాలేదన్నారు. వర్సిటీకి ఏమి చేయలేదు కదా అని తాను వర్సిటీకి రావటం లేదని, తాను ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ సార్లు మాత్రమేనని పేర్కొన్నారు.

కేయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement