హన్మకొండ అర్బన్ /పరకాల : పరకాలలో ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిపాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేతతో కలిసి మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరకాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏ ర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సభకు వివిఽ ద ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందుస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం భద్రతకు అ త్యంత ప్రాధాన్యమిస్తూ హెలిపాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతా లు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్ర ణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను సీపీ శ్వేత ఆదేశించారు. అదనపు కలెక్టర్ రవి, డీసీపీ అంకిత్‌కుమార్, డీఆర్‌డీఓ మేన శ్రీను, స్థానిక సంస్థ ల ఇన్‌చార్జ్, అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు, ఈఈ దేవికతో పాటు పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, కమిషనర్ పవన్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, ఏసీపీ సతీష్‌బాబు, సీఐ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


