పారదర్శకంగా ఇండెంట్లు తయారు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఇండెంట్లు తయారు చేయాలి

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

పారదర్శకంగా ఇండెంట్లు తయారు చేయాలి

జీఎంహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి

హన్మకొండ చౌరస్తా: మందులు, సర్జికల్స్‌ ఇండెంట్లను రోగుల వినియోగానికి అనుగుణంగా, పారదర్శకంగా తయారు చేయాలని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి సూచించారు. జీఎంహెచ్‌లో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వైద్యులు, ఫార్మసీ అధికారులు పరస్పర సమన్వయం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వినియోగాధారిత ఇండెంట్లను రూపొందించాలని పేర్కొన్నారు. సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ (సీఎంఎస్‌) ఇన్‌చార్జ్‌ ఫార్మసీ ఉప్పు భాస్కర్‌రావు, నళిని మాట్లాడుతూ.. సీఎంఎస్‌ నుంచి సరఫరా అయ్యే మందులు, సర్జికల్స్‌ జాబితాపై వైద్యులకు పూర్తి అవగాహన ఉండాలని, దీంతో మందులను మరింత సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రోగులకు ఎలాంటి మందుల కొరత రాకుండా రాష్ట్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, పారదర్శంగా ఇండెంట్లు పంపితే మందుల కొరత నివారించవచ్చని అన్నారు. సీఎంఎస్‌ ద్వారా ఆస్పత్రులకు సరఫరా చేసే 628 రకాల ఔషధాలు, 536 రకాల సర్జికల్‌ సామగ్రికి సంబంధించిన పుస్తకాలను ఆస్పత్రి వైద్యులకు అందజేశారు. జీఎంహెచ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఎ.మంజుల, పిల్లల వైద్య నిపుణురాలు ఎన్‌ మానస, అనస్థీషీయా డి.రాజు, ఆస్పత్రి ఫార్మసీ అధికారులు శోభారాణి, కవిత, రజిని, ఏఓ కె.రమేశ్‌బాబు, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement