స్పందన అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

స్పందన అంతంతే..

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

ప్రణామ్‌ సెంటర్‌పై ప్రచారం కరువు

నామమాత్రంగా తనిఖీలు

నిర్వహణపై వయోవృద్ధుల అసంతృప్తి

మహబూబాబాద్‌: వయో వృద్ధుల సంక్షేమం, వారి కాలక్షేపం కోసం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రణామ్‌ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను మంజూరు చేసింది. నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన సెంటర్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సంబంధిత అధికారుల తనిఖీలు లేక.. నిర్వహణ సరిగా లేకపోవడంతో వయోవృద్ధులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

నాలుగు నెలల క్రితం..

జిల్లా కేంద్రంలోని మండల విద్యాశాఽఖాదికారి కార్యాలయంలోని రెండు గదుల్లో ప్రణామ్‌ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధుల కోసం ఆ సెంటర్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు సెంటర్‌ నిర్వహణ చేపడుతున్నారు. ఈనెల 8,9,10వ తేదీల్లో ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో సెంటర్‌ బంద్‌ చేశారు.

ఆటవస్తువులు..

సెంటర్‌లో స్నాక్స్‌, టీ, అరటి పండ్లు, రాగి జావ, జొన్న గటిక ఇతర ఆహార పదార్థాలు ప్రతీరోజు ఇవ్వాలి. దానిలో క్యారమ్స్‌, చెస్‌, కథల పుస్తకాలు, టీవీ ఏర్పాటు చేశారు. వారానికి ఒక రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్‌లో సూపరింటెండెంట్‌, కుక్‌, ఏఎన్‌ఎం, మల్టీపర్సస్‌ వర్కర్‌ పని చేస్తున్నారు.

నామమాత్రంగా తనిఖీలు..

సెంటర్‌ను సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో సూపరింటెండెంట్‌ ఇష్టారాజ్యంగా వ్యవహస్తున్నారని పలువురు వయోవృద్ధులు ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా బిల్లులు పెడుతున్నా.. అఽధికారులు ఆమోదిస్తున్నారని పలువరు ఆరోపిస్తున్నారు. రెండు నెలలకు రూ.50,000 బిల్లు వచ్చినట్లు ఆసెంటర్‌ సూపరింటెండెంట్‌ లోకేష్‌ తెలిపారు.

ప్రచార వైఫల్యంతో..

జిల్లా సంక్షేమశాఖ అధికారులు సెంటర్‌ నిర్వహణపై ప్రచారం చేయకపోవడంతో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సెంటర్‌కు ప్రతీరోజు 12నుంచి 13 మంది వస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, సూపరింటెండెంట్‌ మాత్రం సెంటర్‌కు ప్రతీరోజు 30మంది వయో వృద్ధులు వస్తున్నట్లు తెలిపారు. అయితే బిల్లులు, హాజరు పట్టిక ఇతర వాటిపై విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని పలువురు అంటున్నారు.

రెండు నెలల బిల్లులు మాత్రమే ఇచ్చారు

సెంటర్‌ ఏర్పాటు చేసి నాలుగు నెలలు పూరైంది. కానీ, రెండు నెలల బిల్లులు మాత్రమే వచ్చాయి. సెంటర్‌ మాత్రం సక్సెస్‌ అయింది. ఆ సెంటర్‌ మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ, ప్రతీరోజు కూడా భోజనం పెడుతున్నాం. సంబంధిత అధికారుల సహకారంతో సెంటర్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.

– లోకేష్‌, సెంటర్‌ సూపరింటెండెంట్‌

సెలవుల్లో కూడా ఉండాలని..

సెలవులు ఇస్తే సెంటర్‌ బంద్‌ చేస్తున్నారు. సెంటర్‌ బంద్‌ చేస్తే కాలక్షేపానికి ఇబ్బంది అవుతుందని, సెలవుల్లో కూడా సెంటర్‌ నిర్వహించాలని వయోవృద్ధులు కోరుతున్నారు. సెంటర్‌ను సక్రమంగా నిర్వహిస్తే వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement