● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ స్నేహశబరీష్ కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘన ంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆయన సిద్ధాంతాలు, భావజాలం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నాగలక్ష్మి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలపై స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేస్తామని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, ఆర్వో నాగలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్‌కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


