తొర్రూరు: ఆషాఢమాసం సందర్భంగా తొర్రూరు పట్టణంలో గోరింటాకు సందడి నెలకొంది. లయ న్స్‌క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలో గోరింటాకు సంబురాలు నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. తీరొక్క డిజైన్లతో కూడిన గోరింటాకు పెట్టుకుని అతివలు ఆనందంగా గడిపారు. గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని వినాయక ఫ్రెండ్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రతినిధులు బుదారపు పద్మ, కందగట్ల సులోచన, పద్మ, అనురాధ, భవాని, సంధ్యారాణి, స్వాతి పాల్గొన్నారు.


