హసన్‌పర్తి : శుక్రవారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో శివాని జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన పి.శ్రీవాణి (472 మార్కులు), బి.స్వాతి (465), జి.హాన్సిక (454), బి.వంశీ కృష్ణ (437) సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ టి.స్వామి తెలిపారు. వీరితో పాటు మరో పది మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. ప్రిన్సిపాల్స్ సురేందర్ రెడ్డి, చంద్రమోహన్, డైరెక్టర్లు టి.రాజు, ఎన్.రమేష్, ఎ.మురళీధర్, వి.సురేష్, ఎస్.సంతోష్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


