ఆలేరు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేట గ్రామానికి చెందిన బానోత్ యాకూబ్ (50) అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామం నుంచి ఎక్సెల్ వాహనంపై హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులోని బహద్దూర్‌పేట ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యాకూబ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. మృతుడి భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు.


