● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు
నెల్లికుదురు: తెలంగాణ రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని, ఆయన కుటుంబం మాత్రం బాగు పడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని మరచి ఆయన కుటుంబాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాటలు తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, బూత్ లీడర్లు, మండల అధ్యక్షులు సమన్వయంతో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్, రాష్ట్ర నాయకుడు కల్యాణ్‌నాయక్, కార్యవర్గ సభ్యులు రాచందర్‌రావు, సుధీర్‌రెడ్డి, మహేష్ గౌడ్, మదన్‌లాల్, మండల అధ్యక్షుడు చందు రాజు, నాయకులు నల్లాని పాపారావు, పద్మ, సతీష్, సుజాత, శ్రీదేవి పాల్గొన్నారు. కాగా మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి 15 మంది బీజేపీలో చేరగా గౌతమ్ రావు వారికి కండువా కప్పి ఆహ్వానించారు.


