ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ కోడిగుడ్లు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కోడిగుడ్లతో ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌, ఎగ్‌ నూడిల్స్‌ తయారు...

Jul 12 2023 5:54 AM | Updated on Jul 12 2023 6:43 PM

- - Sakshi

స్టాంప్‌ వేసి ఉన్న కోడిగుడ్లతో ఫాస్ట్‌ఫుడ్‌ తయారు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా

మహబూబాబాద్‌ అర్బన్‌: మానుకోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ కోడిగుడ్లతో ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌, ఎగ్‌ నూడిల్స్‌ తయారు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా స్టాంప్‌లు వేస్తున్నారు. అయితే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో స్టాంప్‌ వేసి ఉన్న కోడిగుడ్లతో ఫాస్ట్‌ఫుడ్‌ తయారు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అవకతవకలు జరుగుతున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనమని, ఇప్పటికై నా ఐసీడీఎస్‌ అధికారులు పర్యవేక్షణ పెంచి, తనిఖీలు విస్తృతం చేయాలని నెటిజన్లు, జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement