ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: విద్యార్థుల్లో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించాలని నోడల్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎన్నికలపై కళాశాల, పాఠశాలస్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్ట్రోరల్‌ లిటరసీ క్లబ్‌ల ద్వారా ఎన్నికలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. ఓటరు జాబితా తయారు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement