మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

కొత్తగూడ: మహిళ సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన పింఛన్‌ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా ఒక్కో సంఘానికి రూ.20లక్షలకు పైగా రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు తీసుకునే రుణాలతో చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. అనంతరం వితంతువులు, దివ్యాంగులకు పింఛన్‌ మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలో 391 మందికి పింఛన్‌ మంజూరైందని, ఎక్కడైనా సరైన ఆధారాలు లేక పింఛన్‌ మంజూరు కాని వారిని గుర్తించి వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రబీలో ఆరుతడి పంటలకే మొగ్గు చూపాలని, వరి సాగు చేసి ఇబ్బంది పడవద్దని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్‌ రాజు, వివిధ శాఖల అధికారులు, 24 గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

గంగారం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతన పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గంగారం మండలాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్లు, వైద్యం, విద్య అందుబాటులో ఉండేవిధంగా కృషి చేస్తామన్నారు. డీఆర్‌డీఓ మధుసూదన్‌, గంగారం రేంజర్‌ మయూరి, ఏఓ వేణు, తహసీల్దార్‌ బాలకిషన్‌, ఎంపీఓ రాంప్రసాద్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు ముడిగ వీరభద్ర పోతయ్య, నాయకులు చల్ల నారాయణరెడ్డి, వజ్జ సారయ్య, సుంకరబోయిన మొగిళి, వెంకటేశ్వర్లు, ముడిగ విజయ్‌, గూడూరు సీఐ వినయ్‌ కుమార్‌, ఎస్సై రాజ్‌కుమార్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement